బాత్ రూమ్ లో రేవ్ పార్టీ... షాకిచ్చిన టీచర్లు... 

బాత్ రూమ్ లో రేవ్ పార్టీ... షాకిచ్చిన టీచర్లు... 

ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అభిరుచి ఉంటుంది.  చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్లు పెద్దయ్యాక ప్రొఫెషనల్ గా మారే అవకాశం ఉంటుంది.  అమెరికాకు చెందిన ఓ విద్యార్థి తాను చదువుకునే స్కూల్ టాయిలెట్ లో రేవ్ పార్టీ పెట్టాడు.  తన దగ్గర ఉన్న డీజే పరికరాలను టాయిలెట్ లోకి తీసుకెళ్లి సెట్ చేసి స్నాప్ చాట్ ద్వారా తోటి విద్యార్థుల కోసం 30 నిమిషాలపాటు ఈ రేవ్ పార్టీని నిర్వహించాడు.  ఈ విషయం టీచర్లకు తెలియడంతో బాత్ రూమ్ లోకి వచ్చి అతడి డీజే పరికరాలను స్వాధీనం చేసుకొని ఇంటికి పంపించారు.  దిగాలుగా ఇంటికి వచ్చిన కొడుకును తల్లి ఫోటోలు తీసింది.  వాటికి సంబంధించిన ఫోటోలను తన పేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది.  మ్యూజిక్ ను స్పిన్ చేయడం అంటే ఇష్టపడే తన కొడుకు కెల్ బెల్ ను మెచ్చుకుంటూ మెసేజ్ చేసింది.  ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అటు నెటిజన్లు కూడా కెల్ బెల్ ను మెచ్చుకున్నారు.  పెద్దయ్యాక ప్రపంచం గర్వించదగిన డీజే అవుతావని ప్రశంసించారు.