2800 కిలోమీటర్లు నడిచిన బాలుడు...ఎందుకంటే...!!

2800 కిలోమీటర్లు నడిచిన బాలుడు...ఎందుకంటే...!!

 

ప్రపంచం చాలా చిన్నదైంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం 24 గంటల్లో ప్రయాణం చెయ్యొచ్చు.  24 గంటల్లో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ మిత్రులను, కుటుంబసభ్యులను కలుసుకోవచ్చు.  కానీ, లాక్ డౌన్ సమయంలో ప్రయాణసాధనాలన్నీ బంద్ అయ్యాయి.  ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్ళాలి అంటే తీవ్రమైన రిస్ట్రిక్షన్స్ ఏర్పడటంతో ఎవరింట్లో వారు ఉండిపోయారు. 

ఇటలీలోని సిసిలీలో నివసిస్తున్న రోమియో కాక్స్ అనే పదేళ్ల బాలుడికి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం.  ప్రతి సమ్మర్ వెకేషన్స్ కు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాడు.  అలానే ఈ ఏడాది కూడా ప్లాన్ చేసుకున్నాడు.  కానీ, కరోనా కారణంగా రాకపోకలపై నిషేధం విధించడంతో, ఆ బాలుడు నడకద్వారా సిసిలీ నుంచి లండన్ కు చేరుకోవాలని అనుకున్నాడు.  2800 కిలోమీటర్ల మేర నడిచేందుకు సిద్ధం అయ్యాడు.  కొడుకు కోసం తండ్రి కూడా నడిచి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 

2 నెలలపాటు సుదీర్ఘమైన నడక తరువాత ఇటలీలోని సిసిలీ నుంచి 2800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్ కు చేరుకున్నారు.  ఇటలీ నుంచి నడక ప్రారంభించిన సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నామని రోమియో కాక్స్ పేర్కొన్నాడు.  లండన్ కు చేరుకున్నాక రోమియో అతని తండ్రిని ఐసోలేషన్ లో ఉంచారు. ఐసోలేషన్ పూర్తయ్యాక తన అమ్మమ్మను కలుసుకుంటానని చెప్తున్నాడు రోమియో.