బోయపాటి ఇంద్ర 2 తీస్తున్నాడా..?

బోయపాటి ఇంద్ర 2 తీస్తున్నాడా..?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.  రంగస్థలం హిట్ తరువాత, వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి.  బోయపాటి అనే సరికి మాస్ యాక్షన్ మసాలా సీన్స్ ఉంటాయని అనుకోవడం పరిపాటి.  బోయపాటి..చరణ్ సినిమాలో ఇవన్నీ తప్పకుండా ఉంటాయి.  అంతేకాదు, స్టోరీ లైన్ ను బట్టి ఓ విషయం తెలుస్తోంది.  సొంత ఊరికి దూరంగా ఉండే ఓ హీరోకి సంబందించిన కథ.  హీరో ఊరికి దూరంగా ఎందుకు ఉంటున్నాడు.. హీరో వర్తమానంలో సంతోషంగా ఉన్నప్పటికీ.. గతం తాలూకు ఎదురయ్యె సమస్యలు ఏంటి.. వాటిని హీరో ఎలా ఎదుర్కోన్నాడు.. అన్నది చిత్ర కథ అట.  ఈ కథను వింటుంటే.. ఇంద్ర సినిమాలోని ఫ్యాక్షన్ ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది.  మామూలుగానే బోయపాటి ఎంచుకునే సినిమాల్లో మాస్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  మరి ఇంద్ర లాంటి కంటెంట్ స్టోరీని తీసుకొని చరణ్ తో సినిమా చేస్తే.. ఎలా ఉంటుందో కదా.. రంగస్థలాన్ని బీట్ చేసినా ఆశ్చర్యపోనవసరంలేదు..