బోయపాటి ఇంట తీవ్ర విషాదం

బోయపాటి ఇంట తీవ్ర విషాదం


టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఈరోజు కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. అక్కడే ఈ రోజు రాత్రి 7.22 నిమషాలకు ఆమె మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆమె బాధ పడుతున్నారు. అలా అస్వస్థతతో ఉన్న ఆమె ఈరోజు చివరి శ్వాస విడిచారు. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూట్ స్పాట్ లో ఉన బోయపాటి విషయం తెలియగానే హుటాహుటిన పెదకాకాని బయలు దేరి వెళ్లారు.