రామ్ చరణ్ సినిమాకు క్లాసికల్ టైటిలా..?

రామ్ చరణ్ సినిమాకు క్లాసికల్ టైటిలా..?

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  బోయపాటి తన మార్క్ హైవోల్టేజ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయింది.  వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నాడు బోయపాటి.  ఇదిలా ఉంటె, రామ్ చరణ్ సినిమా బోయపాటి ఎలాంటి టైటిల్ ను పెట్టబోతున్నారు అనేదానిపై సందిగ్దత నెలకొంది.  ఇప్పటికే స్టేట్ రౌడీ, వినయ విధేయ రామ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.  స్టేట్ రౌడీ అనే టైటిల్ ను పెడతారని.. ఇదైతే.. మెగా పవర్ స్టార్ కు సరిగ్గా సరిపోతుందని అందరు అనుకున్నారు.  

అందరి అంచనాలను తలక్రిందులుగా చేస్తూ.. వినయ విధేయ రామ టైటిల్ వైపు యూనిట్ మొగ్గు చూపినట్టుగా తెలుస్తున్నది.  హైవోల్టేజ్ సినిమాకు క్లాసికల్ టైటిల్ ఏంటని ఇప్పటినుంచే ఫ్యాన్స్ ప్రశ్నించడం మొదలుపెట్టారు.  హైవోల్టేజ్ సినిమాకు పవర్ఫుల్ గా ఉండే టైటిల్ ఉంటేనే బాగుందని ఫ్యాన్స్ అభిప్రాయం.  వినయ విధేయ రామ టైటిల్ వైపుకే మొగ్గు చూపిన బోయపాటి.. త్వరలోనే అధికారికంగా ఈ టైటిల్ ను ప్రకటిస్తారని తెలుస్తున్నది.  గతంలో బోయపాటి.. బెల్లంకొండ శ్రీనుతో సినిమా చేసినప్పుడు ఇలాగే జయ జానకి నాయక అనే టైటిల్ పెట్టారు.  సినిమా హైవోల్టేజ్ గా ఉన్న టైటిల్ సాఫ్ట్ గా ఉండటంతో జనాలను ఆకర్షించలేదు.  త్రివిక్రమ్... ఎన్టీఆర్ ల అరవింద సమేత వీర రాఘవ హిట్ కావడంతో...బోయపాటి వినయ విధేయ రామ టైటిల్ వైపుకు మొగ్గు చూపి ఉంటారని సమాచారం.