బోయపాటికి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

బోయపాటికి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

బోయపాటి శ్రీను సినిమా అంటే భారీగా ఉంటుంది.  మాస్ కు కావాల్సిన యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా చిత్రీకరిస్తారు.  స్టార్ హీరోతో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తే.. థియేటర్లలో విజిల్స్ విజిల్స్.  సింహ, లెజెండ్ సినిమాల్లో ఇలాంటిస్ సన్నివేశాలు చిత్రీకరించి బాలకృష్ణ రేంజ్ ను అమాంతం పెంచేశాడు.  తన సినిమాల్లో ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయో.. అదే విధంగా సెంటిమెంట్ కూడా ఉంటుంది.  బోయపాటి సినిమాల్లో కొన్ని సీన్స్ ను సెంటిమెంట్ కోసం కొన్ని ప్రదేశాల్లో చిత్రీకరిస్తుంటాడు.  అదెక్కడా కాదు సింహాచలంలో.  సింహాచలం నరసింహస్వామీ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి.  

అందుకే ఈ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ చేయడానికి బోయపాటి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాడు. రామ్ చరణ్ తో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్ ను ఈ టెంపుల్ బ్యాక్ డ్రాప్ గా చిత్రీకరిస్తున్నాడట.  రామ్ చరణ్ టెంపుల్ లో దర్శనం చేసుకునే సన్నివేశాలు.. అక్కడ ఫ్యామిలితో కలిసి ఉండే సీన్స్.. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి షూట్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ రామ్ చరణ్ సినిమాకు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.