చిన్న హీరోతో బోయపాటి పెద్ద సినిమా.. నిజమేనా?

చిన్న హీరోతో బోయపాటి పెద్ద సినిమా.. నిజమేనా?

బోయపాటి సినిమాలంటే భారీగా ఉంటాయి.  మాస్ ను మెప్పించే సినిమాలు తీయడంలో దిట్ట.  సినిమా హిట్టయితే ఆ హీరోకు మాములు పేరు రాదు.  ఇండస్ట్రీ రికార్డులు ఖాయం అనే నానుడి ఉన్నది.  కానీ, గత కొంతకాలంగా ఈ దర్శకుడు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.  విజయ విధేయ రామ కెరీర్లోనే భారీ ప్లాప్ ఇచ్చాడు.  

బాలకృష్ణతో సినిమా చేయాల్సి ఉన్నా అది ఎందుకో వాయిదా పడింది.  ఎప్పుడు పట్టాలెక్కుతోంది అన్నది తెలియాలి.  అల్లు అరవింద్ .. బోయపాటి కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నా.. ఎప్పుడు ఉంటుంది అనే క్లారిటీ లేదు. అయితే, ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే... బోయపాటి శ్రీను కన్నడ హీరో నిఖిల్ గౌడ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.  

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ.  నిఖిల్ గతంలో సినిమాలు చేశాడు.  మూడేళ్ళ క్రితం భారీ ఖర్చుతో జాగ్వార్ సినిమా చేశారు.  ఆ మూవీ ఎలా ఉన్నా.. నిఖిల్ గౌడ పేరు బయటకు వచ్చింది.  గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి ఓటమిపాలయ్యాక దాని నుంచి బయటపడేందుకు వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడట.  బోయపాటితో సినిమా చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ హీరోనే కరెక్ట్ అంటున్నారు.  బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి నిఖిల్ హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది.  అయితే, ఈ సమయంలో బోయపాటికి ఓ మంచి సాలిడ్ హిట్ కావాలి.  దాన్ని ఎంతవరకు నిలుపుకుంటాడు అన్నది చూడాలి.