అశ్విన్ కంటే నాథన్ లైయన్ బెస్ట్ టెస్ట్ ఆఫ్ స్పిన్నర్ : బ్రాడ్ హగ్

అశ్విన్ కంటే నాథన్ లైయన్ బెస్ట్ టెస్ట్ ఆఫ్ స్పిన్నర్ : బ్రాడ్ హగ్

రవిచంద్రన్ అశ్విన్ గొప్ప బౌలర్, కాని ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడ్ హాగ్, తోటి దేశస్థుడు నాథన్ లియాన్ ను పొడవైన టెస్ట్ ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా పేర్కొన్నాడు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ళు చేస్తున్నట్లే, ఆస్ట్రేలియా తరపున 7 టెస్టులు మరియు 123 వన్డేలు ఆడిన 49 ఏళ్ల హాగ్, క్రికెట్ ప్రియుల కోసం ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అశ్విన్ మరియు లియోన్లలో ఎవరు టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమం గా భావిస్తారని అడిగినప్పుడు, హాగ్ ఇలా సమాధానమిచ్చాడు: "గత సంవత్సరంలో లియోన్ అశ్విన్ నుండి ఉత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా అనే పేరును తీసుకున్నాడని నేను భావిస్తున్నాను అని తెలిపాడు. ఎందుకంటే అన్ని పరిస్థితులలోనూ వికెట్లు సాధించిన లియోన్‌తో పోలిస్తే అశ్విన్ గొప్ప విదేశీ విజయాలు సాధించలేదనే అంశం నుండి హాగ్ తన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 365 వికెట్లు సాధించగా, లియోన్ 96 టెస్టుల్లో 390 వికెట్లు సాధించాడు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అని మ్యాచ్లు నిలిచిపోయిన విషయం అందరికి తెలిసిందే.