భారత్ ను భారత్ లోనే ఓడించాలంటేఅది పాక్ కు మాత్రమే సాధ్యం...

భారత్ ను భారత్ లోనే ఓడించాలంటేఅది పాక్ కు మాత్రమే సాధ్యం...

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉండే ఆ ఉత్సహమే వేరు. ఆ మ్యాచ్ జరుగుతున్నంతసేపు విజయం ఎవరిని వరిస్తుంది అనిఇరు దేశాల అభిమానుల్లో ఓ టెన్షన్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ దేశాల మధ్య  ఉన్న పరిస్థితుల కారణంగా భారత్ పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నమెట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఇక టెస్ట్, వన్డే ఫార్మాట్లో భారత జట్టు ముందుంటే టీ 20 లో మాత్రం పాక్ ముందుంది. అయితే భారత జట్టును సొంత గడ్డపైన ఓడించేంచడం ఏ జట్టుకైనా చాలాకష్టం. అలాంటింది  భారత్ ను భారత్ లో ఓడించడం పాకిస్థాన్ జట్టుకు సాధ్యమే అంటున్నాడు  ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్. పాకిస్తాన్ యొక్క బలమైన పేస్ అటాక్, మంచి స్పిన్నర్లు మరియు బ్యాటింగ్ లైన్ అప్ భారతదేశంలో వారికి విజయం అందించడం లో సహాయపడతాయని అతను చెప్పాడు. అయితే భారత్ పాక్ మధ్య మ్యాచ్  గత కొంతకాలంగా చూడలేదు.అందుకే ఈ రెండు జట్ల మధ్య ఓ సిరీస్ జరగాలి, ఇది కేవలం అభిమానులకోసమే కాదు విరాట్ కోహ్లీ మరియు బాబర్ అజామ్ మధ్య మెరుగైన బ్యాట్స్మాన్ ను కనుగొనటానికి సహాయపడుతుంది. అలాగే ఈ రెండు జట్ల బౌలర్ల మధ్య జరుగుతున్న పోటీకి ఈ సిరీస్ తెరదించుతుంది అని తెలిపాడు.