ఆ రికార్డు బ్రేక్ చేయడం కోహ్లీకి మాత్రమే సాధ్యం : బ్రాడ్ హాగ్

ఆ రికార్డు బ్రేక్ చేయడం కోహ్లీకి మాత్రమే సాధ్యం : బ్రాడ్ హాగ్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యొక్క అసాధారణ క్రికెట్ విజయాలను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి ప్రతిభ, ఫిట్నెస్ మరియు మానసిక సామర్థ్యం లభించాయని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నారు . సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ పై 16 సంవత్సరాల వయస్సులో అరంగేట్రం చేశాడు మరియు ప్రపంచ ఐకానిక్ క్రికెటర్లలో ఒకడయ్యాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించాడు. అయితే సచిన్ అని ఫార్మాట్లలో 34,357 పరుగులు - 200 టెస్టుల్లో 15,921, 463 వన్డేల్లో 18426 మరియు 1 టీ 20 లో 10 పరుగులు చేసాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు కొట్టిన ఏకైక ఆటగాడు సచిన్. ఆ రికార్డు ను కోహ్లీ మాత్రమే  బ్రేక్ చేయగలడు అని బ్రాడ్ హాగ్ తెలిపాడు. అందుకోసం కావాల్సిన మానసిక బలం మరియు ఫిట్నెస్ అన్ని కోహ్లీకి ఉన్నాయని తెలిపాడు. సచిన్ టెండూల్కర్ సాధించిన 100 శతకాల్లో.. 49 సెంచరీలు వన్డేల్లో... 51 శతకాలు టెస్టుల్లో బాదాడు. అయితే.. విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో 43 శతకాలు పూర్తి చేసి సచిన్ రికార్డ్‌కి చేరువకాగా.. టెస్టుల్లో మాత్రం 27 శతకాలు బాది అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 70 శతకాలు సాధించాడు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.