‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం...ఏడిపిస్తాడా ?

‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం...ఏడిపిస్తాడా ?

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ’రంగమార్తాండ’. మరాఠీలో అఖండ విజయం సాధించిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ గా తెలుగులో ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయాన్ని ప్రకటించారు కృష్ణ వంశీ. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ప్రతి ఒక్కరి మనస్సును కదిలించేవిధంగా ఉంటుందని కృష్ణవంశీ తెలిపారు. నటన నుంచి తప్పుకున్న స్టేజ్ ఆర్టిస్టు విషాదకర జీవితమే ‘రంగమార్తాండ’ సినిమా అని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో ఈ పాత్రలోనే బ్రహ్మానందం నటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతుండగా కృష్ణవంశీ నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు.