బన్నీ, రానాలకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌

బన్నీ, రానాలకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌

కమెడియన్‌ బ్రహ్మానందం అంటే జనాల్లో ఎంత క్రేజో మాటల్లో చెప్పలేం. ఎలాంటి వారినైనా తన కమెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు బ్రహ్మానందం. అలాంటి బ్రహ్మానందం కరోనా ప్రభావం వల్ల ఆయన తనలోని చిత్రకారుడిని బయటకు తెచ్చారు.  ఇండియాలో కరోనా కట్టడికి చేసిన లాక్‌ డౌన్‌ గురించి తెలియజేస్తూ... హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడు, ఆనంద బాష్పాలు కారుస్తున్న హనుమంతుడు, ఇలాంటి బొమ్మలను అద్భుతంగా చిత్రీకరించారు. అయితే..  తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా టాలీవుడు స్టార్‌ హీరోలు దగ్గుబాటి రానా, అల్లు అర్జున్‌లకు బ్రహ్మానందం స్పెషల్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. 45 రోజులపాటు శ్రమించి శ్రీ వెంకటేశ్వర స్వామి స్కెచ్‌ను పెన్సిల్‌ తో గీసి.. దాన్ని ఫొటో ఫ్రేమ్‌ చేయించి కొత్త సంవత్సరం కానుకగా హీరోలకు అందించారు బ్రహ్మానందం. బ్రహ్మానందం పంపించిన కానుక పట్ల బన్నీ కూడా తన దైన స్టైల్‌లో స్పందించారు. బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు అంటూ బన్నీ ట్వీట్‌ చేశారు.