బాహుబలిని ఫాలో అవుతున్న బ్రహ్మాస్త్ర..!!

బాహుబలిని ఫాలో అవుతున్న బ్రహ్మాస్త్ర..!!

సినిమా నిర్మాణం ఒకప్పుడు ఫ్యాషన్.  ఇప్పుడు వ్యాపారంగా మారింది.  సినిమా బడ్జెట్ పెరిగింది.  ఒక హీరోతో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తే.. పెట్టిన డబ్బులు తిరిగి వెనక్కి వస్తాయో రావో అన్న సందేహం ఇప్పటి నిర్మాతల్లో బలంగా ఉంది.  అందుకే వీలయితే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  ఎలాగో బడ్జెట్ భారీగా ఉంటుంది.  మల్టీస్టారర్ సినిమాయితే పెట్టిన డబ్బు వెనక్కి వస్తుంది.  నిడివి, నిర్మాణం బాగుంది అనుకుంటే రెండు మూడు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు.  ఇది అదనపు లాభం.  

బాహుబలి సినిమా ఇలానే లాభాలు తెచ్చుకుంది.  ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ వసూళ్లు సాధించింది.  ఫస్ట్ పార్ట్ తరువాత క్యూరియాసిటీని కలిగించడమే దీనికి కారణం.  అన్ని సినిమాలకు ఇలా కుదురుతుందా అంటే చెప్పలేం.  సాధ్యం కాకపోవచ్చు.  ఇండియాలో మిగతా భాషా చిత్రాల కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి.  స్టార్ హీరోలు ఇగోలను, చట్రాలను పక్కన పెట్టి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.  ఇప్పుడు బాలీవుడ్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోంది.  అదే బ్రహ్మాస్త్ర.  రన్బీర్ కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్లు.  వీరితో పాటు అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున తదితరులు నటిస్తున్నారు.  

కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు.  కుంభమేళా ఆఖరి రోజున ప్రయాగలో ఈ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించారు.  బ్రహ్మాస్త్ర సినిమాను ఒక పార్ట్ గా కాకుండా మూడు పార్టులుగా చిత్రీకరిస్తున్నారట.  ఈ ఫ్రాంచైసీలోని ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 25, 2019 న రిలీజ్ చేయబోతున్నారు.  మిగతా రెండు పార్ట్స్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారట.