'బ్రహ్మోత్సవం' కన్నా తక్కువగా 'మహర్షి' వసూళ్లు !

'బ్రహ్మోత్సవం' కన్నా తక్కువగా 'మహర్షి' వసూళ్లు !

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఈరోజే భారీ ఎత్తున విడుదలైంది.  యూఎస్లో నిన్ననే ప్రీమియర్ల ద్వారా చిత్రం ప్రదర్శితమైంది.  ట్రేడ్ వర్గల్ లెక్కలు మేరకు ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ 511,000 డాలర్లు.  ఈ మొత్తం మహేష్ ఘాట్ చిత్రాల్లో ఒకటైన 'బ్రహ్మోత్సవం' కంటే తక్కువ కావడం విశేషం.   'బ్రహ్మోత్సవం' గతంలో ప్రీమియర్ల ద్వారా 560,000 డాలర్లను రాబట్టింది.  ఇక మహేష్ కెరీర్లో అత్యధిక ప్రీమియర్ షో వసూళ్లను రాబట్టిన చిత్రం 'స్పైడర్.  ఈ సినిమా సుమారు ఒక మిలియన్ డాలర్లను ప్రీమియర్ షోల ద్వారా ఖాతాలో వేసుకుంది.