ఒకే మ్యాచ్.. ఇద్దరూ ఒకే నంబర్‌ జెర్సీ ఎందుకు?

ఒకే మ్యాచ్.. ఇద్దరూ ఒకే నంబర్‌ జెర్సీ ఎందుకు?
ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ తో ఐపీఎల్‌-11 సీజన్‌ ఘనంగా ప్రారంభమయింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు ఒకే నంబర్‌ జెర్సీ(400) ధరించి ఆడిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఇద్దరూ ఈ మ్యాచ్ లో ఒకే నంబర్‌ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టారు. ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పోలార్డ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో వ్యక్తిగత మైలురాళ్లకు గుర్తుగా ఈ జెర్సీలను ధరించారు. మ్యాచ్‌ అనంతరం డ్వేన్‌ బ్రావో ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. కీరన్‌ పోలార్డ్‌కు ఇది 400వ టీ-20 మ్యాచ్‌.. నేను టీ-20లో 400 వికెట్లు తీసుకున్న తొలిబౌలర్‌ను కావున దీనికి గుర్తుకు తామిద్దరం 400 నెంబర్‌ ఉన్న జెర్సీని ధరించామని తెలిపారు. అయితే ఈ టోర్నమెంట్‌ అనంతరం పాత జెర్సీలను ధరిస్తామని తెలిపాడు. పోలార్డ్‌ ముంబై, నేను చెన్నై టీంతోనూ ముందే మాట్లాడి తుది జట్టులో అవకాశం కల్పించాలని కోరాము అని తెలిపాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో బ్రావో విధ్వంసక ఇన్నింగ్స్ తో చెన్నై జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.