బ్రెజిల్‌ కథ ముగిసింది...

బ్రెజిల్‌ కథ ముగిసింది...

ఫిఫాలో బ్రెజిల్ కథ ముగిసింది... ఫిఫాలో హార్ట్ ఫేవరేట్‌ అయిన బ్రెజిల్ క్వార్టర్‌ఫైనల్‌లోని వెనుదిరిగింది. ఇప్పటి వకు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌... ఆరో సారి వరల్డ్ కప్‌ కొట్టుకుపోవడం ఖాయమని భావించారంతా... కానీ, బ్రెజిల్‌ను బెల్జియం 2-1తో ఓడించింది. మ్యాచ్‌లో ఆరంభం నుంచి రెండు జట్లు పోటాపోటీగా మ్యాచ్ జరగగా... తొలి గోల్‌తో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది... కార్నర్‌ కిక్‌ను అడ్డుకునే ప్రయత్నంలో బ్రెజిల్‌ ఆటగాడు ఫెర్నాండిన్హో సొంత గోల్‌లోకి బంతిని పంపాడు. మరో 18 నిమిషాల్లోనే బెల్జియం ఇంకో గోల్‌ చేసింది. ఆ తర్వాత అగస్టో హెడర్‌ గోల్‌తో బ్రెజిల్‌.. ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. కానీ, మరో గోల్‌ చేయడంలో విఫలం కావడంతో ఓటమి పాలైంది. ఇక సెమీస్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది బెల్జియం.