ఇండియా వ్యాక్సిన్ పై బొల్సోనారో ట్వీట్... సోషల్ మీడియా లో వైరల్
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నుంచి వ్యాక్సిన్ ను కమర్షియల్ ఎక్స్ పోర్ట్ కు అనుమతులు మంజూరు చేసింది కేంద్రం. దీంతో వివిధ దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేస్తున్నారు. 20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను బ్రెజిల్ కు ఎగుమతి చేసింది ఇండియా. ఇండియా నుంచి బ్రెజిల్ కు వ్యాక్సిన్ డోసులు ఎగుమతి కావడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గొప్ప భాగస్వామితో కలిసి పనిచేస్తుండటం గౌరవంగా భావిస్తున్నామని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో పేర్కొన్నారు. అంతేకాదు, ట్విట్టర్ చివర్లో ధన్యవాద్ అని హిందీలో సంభోదించారు. ఇండియా నుంచి హనుమంతుడి సంజీవిని రూపంలో వ్యాక్సిన్ ను తీసుకొస్తున్నారని ఉద్దేశించే ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)