బ్రెజిల్‌ వెడ్స్‌ అర్జంటైనా

బ్రెజిల్‌ వెడ్స్‌ అర్జంటైనా

ఫిఫా వరల్డ్ కప్‌ మానియా ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. భారత్‌లో కూడా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, కేరళలో ఫుట్‌బాల్‌ అభిమానులు ఎక్కువ. త్రిసూర్‌కు చెందిన జబిన్‌, ఇరిన్‌లు తమ  వివాహాన్ని అర్జంటైనా థీమ్‌తో జరుపుకున్నారు.  త్రిసూర్‌లోని సెయింట్‌ మారీస్‌ చర్చిలో జరిగింది. అయితే పెళ్ళి హంగామా అంతా అర్జంటైనా థీమ్‌తోనే.  ఫుట్‌బాల్‌ సీజన్‌లో వివిధ దేశలు ముఖ్యంగా అర్జంటైనా థీమ్‌తో తయారు చేసిన అనేక వస్తువులు మార్కెట్‌లో ఈజీగా దొరకుతాయి. ఇలాంటి ఛాన్స్‌ దొరకాలే గాని.. ఈవెంట్‌ మేనేజర్లకు వేరే చెప్పాలా?.. అంతా అర్జంటైనానే.. ఫోటోలు చూస్తేనే వారి హంగామా ఏమిటో తెలుస్తోంది. పెళ్ళి పార్టీ కోసం అంతా ఇదే థీమ్‌తో అరేంజ్‌ చేశారు. వచ్చిన అతిథుల్లో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్‌ అర్జంటీ ఫ్లాగ్‌ కలర్స్‌ ఉన్న డ్రెస్‌తో వచ్చారు. ఇక పెళ్ళి గిఫ్ట్‌ కూడా ఇదే రంగుల్లోనే. బెలూన్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, వాటర్‌ బాటిల్స్‌. ఛైర్స్‌ డెకరేజన్‌... అంతా అర్జంటైనా మానియానే.

ఇలా కొత్తగా పెళ్ళయిన మరో జంట కూడా ఇలా డిఫరెంట్‌గా తమ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ ప్లాన్‌ చేశారు. మోనిషా, రోషన్‌ అనే జంట త్రిసూర్‌లోని డిఫరెంట్‌ పాయింట్‌ అనే సంస్థకు అప్పగించారు ఫొటోషూట్‌ పని అప్పగించారు. మరింత కలర్‌ ఫుల్‌గా  ఉండాలని... కొత్త సలహా ఇచ్చాడు ఫొటోగ్రాఫర్‌.  బ్రెజిల్‌, అర్జంటైనా థీమ్‌తో ఫొటోలు ప్లాన్‌ చేశాడు. మోనిషా అర్జంటీనా కలర్‌ బ్లూ డ్రెస్‌ వేసుకోగా... రోషన్‌ బ్రెజిల్‌ కలర్‌ పసుపు రంగు జెర్సీ వేసుకున్నాడు. అలా తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన ఫొటోలను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు.