స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్

స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్

వరస లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లకు బ్రేకులు పడ్డాయి. స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ మొత్తం నష్టాలతో నడిచాయి దేశీయ మార్కెట్లు. సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 37,452 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ  59 పాయింట్లు నష్టపోయి 11,046 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌ మోటార్స్‌ వంటి సంస్థలు స్వల్పంగా లాభపడాయి. యస్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంత లిమిటెడ్‌, కోల్‌ఇండియా నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్ రంగంలో షేర్ల అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురికావడంతో ఇండెక్స్ నేలచూపులు చూడాల్సివచ్చింది.