మార్కెట్‌ పరుగుకు బ్రేక్‌...!

మార్కెట్‌ పరుగుకు బ్రేక్‌...!
వరుసగా తొమ్మిది రోజులు లాభాలతో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్‌కు ఇవాళ బ్రేక్ పడింది. అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో ఆరంభం లాభాలను మార్కెట్‌ కోల్పోయింది. ఉదయం నుంచి ఒక మోస్తరు లాభాలతో ట్రేడయిన నిఫ్టికి... చివరి గంటలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది.ఐటీసీ భారీ లాభాల కారణంగా నిఫ్టి కేవలం 22 పాయింట్ల నష్టంతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 63 పాయింట్లు క్షీణించింది. ఇవాళ నిఫ్టి షేర్లలో ఐటీసీ ఏకంగా మూడు శాతం పైగా లాభపడగా, విప్రో, అల్ర్టాటెక్ సిమెంట్‌, జీ ఎంటర్‌టైన్ మెంట్, గెయిల్‌ షేర్లు రెండు శాతం పైగా లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి 50లో నష్టపోయిన షేర్లలో హిందుస్థాన్‌ పెట్రో 3 శాతంపైగా నష్టపోగా... యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, లుపిన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం వరకు నష్టపోయాయి.