అందరూ గిటార్, పేకాట నేర్చుకోవాలి : బ్రెట్ లీ

అందరూ గిటార్, పేకాట నేర్చుకోవాలి : బ్రెట్ లీ

కరోనా కారణంగా వచ్చిన విరామం తర్వాత మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను మొత్తం బయో-సురక్షిత వాతావరణంలో జరిగింది. ఈ సిరీస్ లో పాల్గొనే ఆటగాళ్లు బయటికి వెళ్ళకూడదు అలాగే ఎవరిని కలవకూడదు అనేది ముఖ్య నియమం. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగనుంది. ఈ  లీగ్ కూడా  పూర్తిగా బయో-సురక్షిత వాతావరణంలోనే జగనుంది. అందువల్ల ఆటగాళ్లను రెండు నెలలు ఒకే చోట  కదలకుండా ఎలా కట్టేయాలని అన్ని ఫ్రాంఛైస్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం లో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆటగాళ్లకు కొన్ని సూచనలు చేసాడు. కేవలం మూడు వేదికలో మాత్రమే ఐపీఎల్ జరగనుండటంతో ఆటగాళ్లకు ఎక్కువ ప్రయాణాలు ఉండవు. అందువల్ల రూమ్స్ లోనే ఉండటానికి ఆటగాళ్లు అందరూ గిటార్, పేకాట నేర్చుకోవాలి అని తెలిపాడు. నేను ఆడే సమయంలో మా రూమ్ లో గిటార్ ప్లే చేసేవాడిని అని చెప్పాడు. ఆటగాళ్లు తమ ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తారు. కాబట్టి వారు బయటికి వెళ్లారని నేను అనుకుంటున్నాను అని బ్రెట్ లీ చెప్పాడు.