థెరిసా మే.. మళ్ళీ ఘోర ఓటమి

థెరిసా మే.. మళ్ళీ ఘోర ఓటమి

బ్రిటన్‌ పార్లమెంటులో ప్రధాని థెరిసా మేకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. బ్రెగ్జిట్‌పై జరిగిన ఓటింగ్‌కు ఆమెకు అనుకూలంగా 242 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 391 మంది ఓటు వేశారు. ఈయూ నుంచి బయటకు వచ్చేందుకు డెడ్‌లైన్‌ ఈనెల 29తో ముగుస్తుంది. ఇంతకుమునుపు ఇదే అంశంపై జరిగిన ఓటింగ్‌లో ఆమె ప్రతిపాదనలను 230 ఓట్ల తేడాతో ఎంపీలు ఓడించారు. ఇపుడు కూడా 149 ఓట్ల మెజారిటీతో నో చెప్పారు. తన బ్రెగ్జిట్‌ ప్లాన్‌లో పలు కీలక మార్పులు చేసినట్లు థెరిసా మే చెప్పినా.. ఎంపీల మనసు గెల్చుకోలేకోయారు. ఎలాంటి డీల్‌ లేకుండానే ఈనెల 29లోగా ఈయూ నుంచి బయటకి వచ్చేయాలా అన్న ప్రతిపాదనపై బుధవారం మళ్ళీ ఓటింగ్‌ జరుగుతుందని ప్రధాని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రకటించారు.