పెళ్లి చేసుకోనన్నాడని.. ఆత్మహత్య యత్నం

పెళ్లి చేసుకోనన్నాడని.. ఆత్మహత్య యత్నం

పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోనన్నాడని, మనస్తాపానికి గురైన పెళ్లి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన ఓ యువతికి కొద్దినెలలక్రితం వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగాల్సిఉంది. అందరు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడు.. నువ్వు నచ్చలేదంటూ ఆమె ముఖానే తేల్చిచెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే యువతి బంధువులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.