కరోనా ఎఫెక్ట్ : కనీసం ముద్దు కూడా పెట్టలేని పరిస్థితి !

కరోనా ఎఫెక్ట్ : కనీసం ముద్దు కూడా పెట్టలేని పరిస్థితి !

కరోనా పుణ్యమా అని సంసారాలు  కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు  ప్రజలు. ఎవడిని కదిలిస్తే ఎక్కడ కరోనా అంటాడో అని బయపడిపోతున్నారు. ఇళ్లలోనుంచి బయటకు రావడానికి, ప్రియురాలిని కలుసుకోవడానికి కూడా భయపడుతున్నారు. విదేశాల్లో పెదవిముద్దులు చాలా కామన్. చివరకు ఆ ముద్దుకు కూడా అడ్డుగా మారింది కరోనా . తాజాగా ఫిలిప్పైన్స్‌లోని సముద్రతీరంలో ఉన్న బాకొలాడ్‌నగరం లో అక్కడి ప్రభుత్వం సామూహిక వివాహాన్ని జరిపించింది. దాదాపు 220 జంటలు ఈ పెళ్లివేడుకలో ఒక్కటయ్యాయి. పెళ్లికొడుకులు తెల్లని షర్ట్ ప్యాంట్ ధరించగా పెళ్లికూతుర్లు తెల్లటి గౌన్ లు ధరించారు. అంతబాగానే ఉంది కానీ అందంగా ముస్తాబైన ఆ జంటలు మూతులకు మాస్కులతో దర్శనమిచ్చారు. ఇదంతా కరోనా ఎఫెక్ట్. కరోనా భయంతో వివాహాలనిర్వాహకులు మాస్కులు తప్పని సరి అని నిబంధనలు విధించారు. దాంతో పాపం ఇలా ఆ జంటలు మాస్క్ లతో వచ్చారు. తీరా పెళ్లితతంగం అయిపోయిన వెంటనే తమ భార్యను ముద్దాడాల్సి ఉంటుంది. చివరకు ముద్దులు కూడా మాస్కులు ధరించే పెట్టుకోవాల్సి వచ్చింది. మాస్కులతో ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగానే ఉన్నా తప్పదని సరిపెట్టుకున్నారు ఆ జంటలు.