ఐపీఎల్ 2020 లో కోహ్లీ-కార్తీక్ ల మధ్య తొలిపోరు...?

ఐపీఎల్ 2020 లో కోహ్లీ-కార్తీక్ ల మధ్య తొలిపోరు...?

యూఏఈ వేదికగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 జరుగుతుంది. అయితే ఈ టోర్నీ సెప్టెంబర్ 19 న ప్రారంభమై నవంబర్ 10 ముగుస్తుంది అని చెప్పిన బీసీసీఐ ఆ మధ్యలో జరగాల్సిన మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రం ప్రకటించడం లేదు. అలాగే మొదటి మ్యాచ్ గురించి కూడా సరైన సమాచారం లేదు. ఎందుకంటే.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ గత ఏడాది ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాలి. కానీ సిఎస్కే జట్టులో కరోనా కేసులు నమోదుకావడంతో ఆ జట్టు అందరికంటే ఎక్కువ రోజులు క్వారంటైన్ లో ఉంది. కాబట్టి తమ శిక్షణను ఆలస్యంగా ప్రారంభించింది. అందువల్ల ఆ జట్టు మొదటి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఇంతకముందు ఓసారి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతా... ఐపీఎల్ షెడ్యూల్ సెప్టెంబర్ 5న విడుదల చేస్తారు  అని తెలిపాడు. కానీ అది జరగలేదు. ఇక తాజాగా ఈ రోజు ఐపీఎల్ ట్విట్టర్ లో నిర్వాహకులు ఓ పోస్ట్ చేస్తూ మొదటి మ్యాచ్ గురించి హింట్ ఇచ్చారు. ఆ ట్విట్ లో ''ఈ టోర్నీకి ఇంకా 14 రోజులే ఉంది అంటూ కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్ అలాగే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోలను పోస్ట్ చేసింది.'' అంటే తొలిపోరు ఈ రెండు జట్ల మధ్యే జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజే ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు.