ఎనిమిది లక్షలతో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు.. తీరా వెళ్తే..!! 

ఎనిమిది లక్షలతో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు.. తీరా వెళ్తే..!! 

సెలవులను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంది ఓ జంట.  స్పెయిన్ లోని ఇబిజా లోని ఓ హోటల్ లో విఐపి పెంట్ హౌస్ రూమ్ ను 8 లక్షల రూపాయలతో బుక్ చేసుకున్నారు. పెంట్ హౌస్ లో పెట్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయని యాడ్ చూసి బుక్ చేసుకున్నారు. వారికి హోటల్ లో పెంట్ హౌస్ రూమ్ బుక్ అయ్యింది.  వెంటనే బ్రిటన్ నుంచి స్పెయిన్ వెళ్లి.. అక్కడి హోటల్ కు వెళ్లారు. ఆ హోటల్ లో విఐపి పెంట్ హౌస్ సర్వీస్ లేదని చెప్పడంతో ఆ జంట షాక్ అయ్యింది.  

అక్కడికి నలభై మైళ్ళ దూరంలో ఉన్న మరో హోటల్ కు షిఫ్ట్ అయ్యారు.  హోటల్ బుక్ చేసుకున్న వెబ్ సైట్ సంస్థ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి విషయం అడిగితె.. బుకింగ్ హోటల్ నుంచి రూమ్ క్యాన్సిల్ అయినట్టు చెప్పిస్తే డబ్బు రిటర్న్ చేస్తామని అన్నారు.  వెంటనే మరలా 40 మైళ్ళు ప్రయాణం చేసి హోటల్ కు వెళ్లి అక్కడి రిసెప్షన్ చేత ఆ రూమ్ క్యాన్సిల్ చేయించారు.  సమస్యను తాము పరిష్కరించామని, విఐపి పెంట్ హౌస్ సర్వీసెస్ కు సంబంధించినది ఫేక్ యాడ్ అని ఎయిర్ బిఎంబి సంస్థ ప్రతినిధులు చెప్పడంతో పాపం బ్రిటన్ కస్టమర్లు షాక్ అయ్యారు.