కొత్త ఆఫర్: ఎంతైనా తినండి... బిల్లు సగమే చెల్లించండి... 

కొత్త ఆఫర్: ఎంతైనా తినండి... బిల్లు సగమే చెల్లించండి... 

కరోనా దెబ్బకు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూతపడిన సంగతి తెలిసిందే.  ఇటీవలే తిరిగి తెరుచుకున్నాయి.  తెరుచుకున్నప్పటికీ రెస్టారెంట్లకు వెళ్లి తినాలి అంటే ప్రజలు భయపడుతున్నారు.  దీంతో అటు హోటల్ రంగం కుదేలైంది.  హోటల్ రంగాన్ని నమ్ముకొని లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు.  దీంతో వీరిని ఒడ్డున పడేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 

బ్రిటన్ ఆర్ధిక శాఖ ఓ స్కీమ్ ను ప్రకటించింది.  హోటల్, రెస్టారెంట్ కు వెళ్లి ఎంతైనా తినండి.  బిల్లు సగమే చెల్లించండి అనే పథకాన్ని తీసుకొచ్చింది.  ఈ ఆఫర్ ఒకటో రెండో రెస్టారెంట్లో కాదు, బ్రిటన్ దేశంలోని ఎంపిక చేరిన 72వేల రెస్టారెంట్లలో ఈ పథకం అమలు జరుగుతుంది.  ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు ఈ పథకం అమలు అవుతుంది.  ఈ మూడు రోజులు మీరు ఎంతైనా వచ్చి తినొచ్చు... తిన్న దానిలో సగం మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం నుంచి బ్రిటన్ లోని రెస్టారెంట్స్ లో సందడి మొదలైంది.