రాత్రంతా లండన్ వీధుల్లోనే 16 ఏళ్ల ముంబై అమ్మాయి..!

రాత్రంతా లండన్ వీధుల్లోనే 16 ఏళ్ల ముంబై అమ్మాయి..!

ఓ 16 ఏమ్మాయి.. లండన్‌లో ఇరుక్కుపోయింది.. ఏ హోటల్‌లో రూమ్‌లేదు.. ఏం చేయాలో తెలియదు.. లండన్ వీధులే దిక్కు అయ్యాయి... గంటల తరబడి నిరీక్షణ.. చివరకు లండన్‌లోని తన కజిన్ తన దగ్గర వచ్చే వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఇది తలచుకుంటేనే భయంగా ఉంది కదా? ఇలాంటి పరిస్థితే ఓ అమ్మాయి ఏర్పడింది. దాదర్‌లో నివసిస్తున్న 16 ఏళ్ల ఆష్నా కెన్యా... లండన్‌ నుంచి ముంబై రావడానికి బ్రిటిష్‌ ఎయిర్వేస్‌కు చెందిన విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంది. తీరా విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత చివరి నిమిషంలో ఆ విమానం రద్దు చేశారు. ఇక, రాత్రిపూట విమానాశ్రయంతో మూసివేయడంతో వీధుల్లో గడపాల్సిన పరిస్థితి విచ్చింది. ఏ హోటల్‌కు వెళ్లినా అన్నీ బుక్ కావడం.. వీధుల్లోనే గడపాల్సిన పరిస్థితి ఓ భయంకరమైన అనుభవంగా చెప్పింది ఆష్నా కెన్యా. 

వివరాల్లోకి వెళ్తే ఆష్నా జూలై 25-26 తేదీలలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ లో రేక్‌జాక్-లండన్-ముంబై ప్రయాణం చేస్తోంది. ఏడు గంటల లేఅవర్ తర్వాత ఆమె హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో రాత్రి 9 గంటల సమయంలో బోర్డింగ్ గేట్‌ దగ్గరకు చేరుకుంది. అయితే, లండన్-ముంబై విమానం రద్దు చేసినట్టు చెప్పారు. అప్పటికే ఐస్లాండ్‌లోని ఒక నెల రోజుల శిబిరం నుండి తిరిగి వచ్చిన ఆష్నా.. నిద్రపోక 24 గంటలు గడిచింది.. దీంతో ఏదైనా హోటల్‌లో ఒక రూమ్‌ కావాలని ఎయిర్‌లైన్ సిబ్బందిని కోరే ప్రయత్నం చేసింది. దాదాపు 20 విమానాలు రద్దు చేయబడ్డాయి, ప్రయాణీకులందరికీ వసతి కల్పించడం సాధ్యం కాదని సిబ్బంది చేతెలెత్తేశారని.. తాను ఒంటరిగా ప్రయాణిస్తున్నానని వారికి చెప్పినా పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. గంటన్నర నిరీక్షణ తర్వాత వాళ్ల ఫాదర్ ఫోన్ చేసి హోటల్‌కు వెళ్లమని చెప్పారు.. కర్ఫ్యూ కారణంగా మిడ్‌టైన్ నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ మూసివేయడంతో.. విధిలేని పరిస్థితుల్లో వీధుల్లో పడాల్సి వచ్చింది. ఏ హోటల్ తిరిగినా రూమ్ దొరకలేదు.. చివరకు ఓ హోటల్ లాబీలో గడిపింది. బంధువులకు వాళ్ల నాన్న ఫోన్ చేయడం.. వాళ్లు ఆ ప్రాంతానికి చేరుకునే సరికి అర్ధరాత్రి 2 గంటలైంది.. రాత్రి 3 గంటలకు ఆమెను తీసుకెళ్లి మళ్లీ ఉదయం 7 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో విడిచిపెట్టారు. అనంతరం ఆమె ముంబై చేరుకుంది. అయితే, బ్రిటిష్‌ ఎయిర్వేస్‌ నిర్లక్ష్యం కారణంగా ఆమె వీధుల్లో గడాల్సిన వచ్చింది. బీఏ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బ్రిటిష్‌ ఎయిర్వేస్‌ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.