బయటపడిన బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు..!

బయటపడిన బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు..!

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. శిథిలమైన 10 తుపాకులు లభించాయి. కాకినాడ విద్యుత్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తుపాలకును స్వాధీనం చేసుకున్న కాకినాడ టూటౌన్ పోలీసులు.. విచారణ ప్రారంభించారు. అయితే, ఈ తుపాలకు బ్రిటీష్ కాలం నాటివిగా భావిస్తున్నారు పోలీసులు. కాగా, తవ్వకాల్లో బయటపడిన ఈ తుపాకులు పూర్తిగా శిథిలమయ్యాయి. కేవలం ఇనుప రాడ్లుగానే కనిపిస్తున్నాయి.