లండన్ లో "సీడ్ గణేశా" కార్యక్రమానికి బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ ప్రోత్సాహం 

లండన్ లో "సీడ్ గణేశా" కార్యక్రమానికి బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ ప్రోత్సాహం 

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  పర్యావరణహితంగా ‘సీడ్ గణేశా”(విత్తన గణేష్) గణపతిని స్వాగతిద్దామన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్ గారి పిలుపు మేరకు ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు నేడు భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ  ‌వీరేంద్ర శర్మ గారికి లండన్ లోని తన నివాసం లో విత్తన గణేశుడి విగ్రహాన్ని అందజేశారు.  దేశవ్యాప్తంగా ఎంపీ.జోగినపల్లి సంతోష్ కుమార్  గారి ఆద్వర్యం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  పర్యావరణానికి మేలు కలిగించి వృక్ష సంపదకు కృషి చేస్తూ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎంపీ  ‌వీరేంద్ర శర్మ గారికి ఎన్నారై  టిఆర్ఎస్ నాయకులు వివరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న విప్లవాత్మక "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కార్యక్రమాన్ని ఎంపీ  ‌వీరేంద్ర శర్మ అభినందించారు.  నేడు పర్యావరణ సంరక్షణ అందరి బాధ్యతని...  ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా జరుపుకొనే గణేష్ వేడుకలకు సైతం  ‘సీడ్ గణేశా” పేరుతో ప్రజల్లో చైతన్యం తెస్తున్న తీరు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఎంపీ సంతోష్ ని ప్రశంసించారు.  నేడు ఎంపీ సంతోష్ లాంటి వాళ్ళ అధ్బుతమైన ఆలోచనలే రేపటి తరాలకు వరాలని, వారంతా సంతోష్ సేవలని మర్చిపోరని  తెలిపారు. ప్రవాసులంతా కూడా ‘సీడ్ గణేశా” ను ప్రతిష్టించి వేడుకలు జరుపుకొని బాధ్యత గల పౌరులుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములను  చేసినందుకు ఎన్నారై  టిఆర్ఎస్ నాయకులని అభినందించారు. ఎన్నారై  టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ వీరేంద్ర శర్మ గారు యూకే లో నివసిస్తున్న ఎంతో మంది ప్రవాసులకి ఆప్తులు - ఆదర్శవంతులని, అలాగే ఎంపీ సంతోష్ గారి "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కార్యక్రమాన్ని ప్రవాసులంతా హర్షిస్తున్నారని, నేడు వీరిద్దరి పిలుపుతో తప్పకుండా యూకే వ్యాప్తంగా జరుపుకొనే  గణేష్ వేడుకల్లో ‘సీడ్ గణేశా” ప్రతిమలనే ప్రవాసులు ఉపయోగిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ఎంపీ వీరేంద్ర శర్మ గారికి కృతఙ్ఞతలు తెలిపి, తెలంగాణ నుండి తెచ్చిన చేనేత శాలువాతో ఎంపీ గారిని సత్కరించారు.  ఈ కార్యక్రమంలో  యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి, అడ్వైసరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శులు  సత్య చిలుముల మరియు గొట్టెముక్కల సతీష్ రెడ్డి  పాల్గొన్నారు.