బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్యం విషమం.. ఎలిజిబెత్ రాణి కీలక ప్రసంగం..

బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్యం విషమం.. ఎలిజిబెత్ రాణి కీలక ప్రసంగం..

కరోనా సోకడంతో హోం క్వారంటైన్‌లో గడిపిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలనుంద్దేశించి మాట్లాడారు బ్రిటన్ రాణి ఎలిజిబెత్‌. ఇది కష్టకాలం... అందుకే మీతో మాట్లాడుతున్నానంటూ ప్రజలనుద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు క్లీన్‌ ఎలిజిబెత్‌ టూ. గత 66 ఏళ్లలో బ్రిటన్‌ రాణి ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడడం ఇది నాల్గోసారి. బ్రిటన్‌లో 40 వేల మందికి పైగా కరోనా బారిన పడగా, 4 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా బాధితుల్లో తన తనయుడు ప్రిన్స్‌ చార్లెస్‌ కూడా ఉండడంతో ఎలిజిబెత్‌ రాణి ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో జన జీవనం అస్తవ్యస్తమైందన్నారు ఎలిజిబెత్. కొందరికి దుఖం మిగిల్చగా, అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారామె. మనందరి నిత్యజీవితంలో అనేక మార్పులొచ్చాయి. అయితే, ఈ సవాళ్లను ఎదుర్కొని మనం ఎలా నిలదొక్కుకున్నామన్నది రానున్న రోజుల్లో మనకే గర్వకారణమౌతుందన్నారు బ్రిటన్‌ రాణి. మనం ఎంతటి శక్తివంతులమో భవిష్యతరాలు గుర్తుంచుకుంటాయన్నారు క్వీన్‌ ఎలిజిబెత్ టూ.

కాగా, రెండు వారాల క్రితం ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో వారం రోజుల పాటు అతను ఐసోలేషన్లో గడిపాడు. కరోనా వైద్య పరీక్షలు చేయించుకోడానికి ముందు రోజే చార్లెస్‌ తన తల్లి అయిన బ్రిటన్‌ రాణిని కలిశాడు. దీంతో క్వీన్‌ ఎలిజిబెత్‌కు కరోనా ఎక్కడ సోకుతుందోనని తెగ టెన్షన్‌ పడ్డాయి బకింగ్‌హమ్‌ పేలస్‌ వర్గాలు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా సోకడంతో... పది రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌ పాటిస్తూ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రికి తరలించారు అధికారులు. తాజాగా, గర్భిణి కూడా అయిన అతని 32 ఏళ్ల గర్ల్‌ ఫ్రెండ్‌ కారీ సైమండ్స్‌ కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతోంది. కరోనా ఉధృతి బ్రిటన్‌లో ఆందోళన కలిగిస్తుండడంతో తన సందేశంతో ప్రజలకు ధైర్యం నూరిపోశారు క్వీన్‌ ఎలిజిబెత్‌ టూ.