రివ్యూ: బ్రోచేవారెవరురా

రివ్యూ: బ్రోచేవారెవరురా

నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, శివాజీ రాజా తదితరులు
మ్యూజిక్: వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
నిర్మాతలు: విజయ్‌ కుమార్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ  

బ్రోచేవారెవరురా.. టైటిల్ వెరైటీగా ఉంది.  ఒక్కోసారి వెరైటీగా ఉండే టైటిల్స్ ఆకట్టుకుంటాయి.  సినిమా టైటిల్ వెరైటీగా ఉండటంతో ఆకట్టుకుంది. టైటిల్ వరకు ఒకే.  మరి సినిమా ఆకట్టుకుందా లేదా తెలుసుకుందాం.  

కథ: 

నివేదా థామస్ కు భిన్నతనం నుంచి భరతనాట్యం అంటే ఇష్టం.  పట్టుదలతో నేర్చుకుంటుంది.  అయితే, ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోతారు.  నివేదా తల్లి దగ్గర పెరుగుతుంది.  కొంతకాలం తరువాత నివేదా తల్లి మరణించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి దగ్గరకు వెళ్తుంది.  ఇష్టం లేకపోయినా.. తండ్రి ప్రిన్సిపాల్ గా ఉన్న కాలేజీలో జాయిన్ అవుతుంది.  చదువంటే నివేదాకు ఇష్టం లేదు.  పైగా తండ్రి స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తుంటారు.  ఇదే సమయంలో నివేదాకు శ్రీవిష్ణు పరిచయం అవుతాడు.  అతనికి కూడా ఇంచుమించుగా అదే టైప్ వ్యక్తి.  సరదాగా తిరగాలని అనుకుంటాడు.  తండ్రి క్రమశిక్షణ నుంచి బయటపడేందుకు నివేదా..శ్రీవిష్ణు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కిడ్నాప్ డ్రామా ఆడతారు. డబ్బు డిమాండ్ చేస్తారు.  ఇలా డబ్బుకోసం చేసిన ఆ తప్పు వలన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది కథ. 

విశ్లేషణ: 

గతంలో కిడ్నాప్ డ్రామాతో కూడిన సినిమాలు చాలా వచ్చాయి.  అలా వచ్చినా సినిమాల్లో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి.  అయితే, ఈ సినిమా వాటికి కాస్త భిన్నంగా ఉన్నది.  ఒకవైపు కామెడీ.. మరోవైపు థ్రిల్లింగ్ ను కలిగిస్తూ కథను నడిపాడు ఆత్రేయ.  కిడ్నాప్ డ్రామాను సడెన్ గా నడిపితే ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు.  అందుకే దానికి లీడ్ ఇచ్చేందుకు కాలేజీలో ప్రశ్నపత్రాల దొంగిలించే సన్నివేశాలను తీసుకొచ్చారు.  ఈ సీన్ చాలా సరదాగా ఉంటుంది.  ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధాన బలం.  ఫస్ట్ హాఫ్ సినిమాను ఎంత థ్రిల్లింగ్ గా నడిపించారో.. సెకండ్ హాఫ్ లో కూడా అంతే థ్రిల్ ను కలిగించే విధంగా నడిపించడంలో సఫలం అయ్యాడు.  కామెడీని మిస్ కానివ్వకుండా.. థ్రిల్ ను తగ్గించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.  

నటీనటుల పనితీరు: 

నివేదా థామస్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  ఆమె నటనతో ఆకట్టుకుంది.  భారతనాట్యంలో ప్రవేశం ఉండటంతో ఆ సీన్స్ బాగావచ్చాయి.  శ్రీవిష్ణు అల్లరి కుర్రాడిగా మెప్పించాడు.  నివేతా పెతురాజ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.  మిగతా నటీనటులు వారి పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు వివేక్ ఆత్రేయ కథకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు.  కామెడీలో థ్రిల్లింగ్ ను జొప్పించి మెప్పించాడు.  స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  విశాల్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

నటీనటులు 

మైనస్ పాయింట్స్: 

ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా సాగతీత 

చివరిగా: బ్రోచేవారెవరురా - ఉత్కంఠతతో కూడిన వినోదం