బొబ్బిలిలో ఘోర అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి

బొబ్బిలిలో ఘోర అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్ పరిశ్రమలో శుక్రవారం ఉదయం బాయిలర్ పేలడంతో విధుల్లో ఉన్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు బొబ్బిలి మండలం అలజంగికి చెందిన జగదీశ్‌, బాడంగి మండలం గొల్లాదికి చెందిన సురేశ్‌, భీమవరం గ్రామానికి చెందిన  చింతల గోపాలనాయుడుగా  గుర్తించారు. క్షతగాత్రులను బొబ్బిలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏఎస్పీ గౌతం శాలీ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.