దొంగ బ్రదర్స్: మొత్తం 51 చోరీలు

దొంగ బ్రదర్స్: మొత్తం 51 చోరీలు

వారిద్దరూ అన్నదమ్ములు. చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటారు. ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఒకరు బీటెక్‌ చేస్తే.. ఇంకొకరు డిప్లొమో హోల్డర్‌. చాలా రోజులుగా శోధిస్తున్న ఓ కేసులో వీరే అసలు నిందితులని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. 

విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను బెదిరించి వారి వద్దనున్న బంగారు ఆభరణాలను తస్కరించే తరహా చోరీలు ఎక్కవయ్యాయి. పదుల సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులందాయి. దాదాపు 200 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆభరణాల చోరీ.. వారి పని కాదని తెలియడంతో మరింత గాలించారు. ఆఖరికి ఈ అన్నదమ్ములే అసలు దొంగలని తేల్చారు. 

2016 నుంచి పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్న చంద్రశేఖర్(30), గోపీనాథ్ (28) లను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వీరి తండ్రి స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగి అని తెలిసింది. మొత్తం 51 చెన్‌ స్నాచింగ్‌లతోపాటు మూడు భారీ చోరీల్లో వీరు నిందినులని పోలీసులు నిర్ధారించారు. వీరి వద్ద నుంచి సుమారు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.