యడ్యూరప్ప రాజీనామా...

యడ్యూరప్ప రాజీనామా...

కర్ణాటకలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో బీఎస్ యడ్యూరప్ప... తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం రోజు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప... రెండు రోజులు తిరిగేలోగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా... దాదాపు 20 నిమిషాల ముందే తన ప్రసంగాన్ని ప్రారంభించిన యడ్యూరప్ప... ఉద్వేగపూరితంగా ప్రసంగించారు... దాదాపు 25 నిమిషాలపాటు ప్రసంగించిన అనంతరం రాజీనామా చేసి సభ నుంచి వెళ్లిపోయారు.