సీరియస్ అయిన యడ్యూరప్ప..ఆయన చెప్పినట్టు చేయాలా ?

సీరియస్ అయిన యడ్యూరప్ప..ఆయన చెప్పినట్టు చేయాలా ?

 కర్ణాటకలో తమ వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు మఠాధిపతులే నేరుగా లాబీయింగ్ మొదలు పెట్టారు...నేను చెప్పిన వారికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఆ తర్వాత మా వాళ్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అంటూ నేరుగా ముఖ్యమంత్రినే బెదిరిస్తున్నారు. దెవనగెరెలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ పంచమశాలి సమాజ గురు పీఠాధిపతి వాచానంద స్వామీజీ బహిరంగంగానే ముఖ్యమంత్రి యడ్యూరప్పను మంత్రి పదవికి కోసం బెదిరించారు  లింగాయత్ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మురుగేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని లేకుండా లింగాయత్ వర్గం ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందంటూ హెచ్చించారు. దీంతో స్వామీజీ పక్కనే కూర్చున్న సీఎం యడ్యూరప్పకు కోపం వచ్చింది. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారంటూ అంటూ లేచి నిలబడి ప్రశ్నించారు. మీ పైన గౌరవం ఉందంటూ కాళ్లకు నమస్కారం పెడుతూనే సలహాలు మాత్రమే ఇవ్వండి బెదిరించకండి అంటూ స్పష్టం చేశారు యడ్యూరప్ప.