కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ

కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ

కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ట్రేడింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ నిర్ణయం అన్ని విభాగాలకు వర్తిస్తుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీ తెలిపింది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీ తన ప్రకటనలో తెలిపింది. కార్వీ బ్రోకరేజీ సంస్థ ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది సెబీ నవంబర్‌ 22న గుర్తించి అప్రమత్తమైంది.

ఖాతాదారుల సొమ్మును ఇతరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. మరోవైపు దాదాపు రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా ట్రేడింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశాయి. కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించినట్టయింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు ఎక్స్ఛేంజీలు ఈ సంస్థపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.