బీఎస్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగ సెల్ఫీ సూసైడ్‌..

బీఎస్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగ సెల్ఫీ సూసైడ్‌..

అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ఓ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకుంటూ సూసైడ్‌ చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రాంబాబు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్నాడు. ఇతను తెలిసిన వాళ్ల దగ్గర రూ.లక్ష అప్పు తీసుకున్నారు. ఈ లక్ష రూపాయలకుగానూ నెలకు రూ.16 వేల వడ్డీ కూడా చెల్లించాడు. ఐతే.. అసలు మొత్తం ఒకేసారి ఇస్తావా లేక ఇంటిని విక్రయిస్తావా అంటూ అప్పు ఇచ్చిన వారు వేధించారని రాంబాబు సెల్ఫీ తీసుకుంటూ వాపోయాడు. అనంతరం ప్రాణాలు తీసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్ఫీ వీడియోలో చెప్పిన అంశాలపై విచారణ చేపడుతున్నారు.