బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. మాట్లాడు.. క్యాష్‌బాక్‌ పట్టు..!

బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. మాట్లాడు.. క్యాష్‌బాక్‌ పట్టు..!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్యాష్‌బాక్ ఆఫర్ తీసుకొస్తోంది... ఈ ఆఫర్‌లో ఐదు నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడిన వారికి ఈ క్యాష్‌బ్యాక్ అందజేస్తోంది. బీఎస్ఎన్ఎల్ వైర్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, బీఎస్ఎన్ఎల్ ఎఫ్‌టీటీహెచ్ ఖాతాదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల అనేక కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, పాత ప్లాన్లను సవరిస్తూ వస్తోంది. కాగా, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌కు రిలయన్స్ జియో నిమిషానికి ఆరు పైసల చొప్పు వసూలు చేస్తుండగా.. బీఎస్ఎల్ఎల్ మాత్రం ఐదు నిమిషాలు దాటే ప్రతీ కాల్‌కు 6 పైసలు వెనక్కి ఇస్తోంది అన్నమాట. మా కస్టమర్లు మా అప్‌గ్రేడ్ చేసిన నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌తో మరింతగా నిమగ్నం కావాలని, వైర్‌లైన్‌లో పొందే వాయిస్ కాల్ నాణ్యతను అనుభవించాలని బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ సీఎఫ్‌ఏ డైరెక్టర్ వివేక్ బన్జల్ ఓ ప్రకటనలో తెలిపాడు.