బీఎస్ఎన్ఎల్ ఆఫర్.. 4జీబీ డేటా ఉచితం

బీఎస్ఎన్ఎల్ ఆఫర్.. 4జీబీ డేటా ఉచితం

టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. టెలికాం సంస్థలు తమ వినియోదాదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియోకు దీటుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓ కొత్త ఆఫర్ ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. స్పెషల్ టారిఫ్ ఓచర్ (ఎస్టీవీ)పై 4జీబీ డేటాను ఉచితంగా ప్రకటించింది. స్పెషల్ టారిఫ్ ఓచర్ రూ. 252,  రూ. 402, రూ. 175, మరియు రూ. 219 లపై అందనంగా 4జీబీ డేటాను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఈ కొత్త ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది.