బీఎస్ఎన్ఎల్ రూ.349 ప్లాన్: రోజుకు 3.2 జీబీ డేటా

బీఎస్ఎన్ఎల్ రూ.349 ప్లాన్: రోజుకు 3.2 జీబీ డేటా

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు శుభవార్త అందించింది. బీఎస్ఎన్ఎల్ తన ప్రత్యర్థులకు లేటుగా గట్టి పోటీనిస్తోంది. తాజాగా రూ.349 ప్రిపెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ ప్లాన్‌లో యూజర్లకు ఎక్కువ డేటా ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ తన రూ.349 ప్రిపెయిడ్ ప్లాన్ కింద ప్రతి రోజు 3.2 జీబీ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 64 రోజులు. అంతేకాదు పోస్ట్ ఎఫ్యూపీ స్పీడ్ ను (40) కూడా పెంచింది. ఢిల్లీ, ముంబై మినహాయించి అన్ని బీఎస్ఎన్ఎల్ సర్కిళ్లలోని వినియోగదారులు ప్రతిరోజు అపరిమితంగా ఉచిత వాయిస్ కాల్స్ మరియు 100 ఎస్ఎంఎస్ లను పొందుతారు.