బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్

బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్

ప్రభుత్వరంగ టెలికం సంస్థ.. భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్‌) సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది... కేవలం రూ.108తో రీచార్జ్‌తో 60 రోజ‌లు పాటు ప్రతి రోజు 1 జీబీ డేటా చొప్పున అందివ్వనున్నట్టు వెల్లడించింది. ప్రైవేట్ టెలికం సంస్థలకుసైతం దీటైన ప్లాన్‌తో ఇప్పుడు కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడిపోయిన బీఎస్ఎస్ఎన్ఎల్.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 60 రోజులుగా నిర్ణయించింది. అంటే రూ.108తో రీచార్జ్ చేసుకుంటే.. ఏకంగా 60 జీబీ డేటా వాడుకునే వీలు కల్పించింది.. రూ.108 కొత్త ప్లాన్‌లో ప్రతీరోజు 1 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను కూడా తెచ్చింది. అంతేకాదు.. డైలీ డేటా పూర్తి అయితే.. డౌన్‌లోడింగ్‌, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌తో ఇంటర్నెట్ సదుపాయం అపరిమితంగా వాడుకునే వీలుకూడా ఉంటుందని చెబుతోంది.. అయితే, ఈ కొత్త ప్లాన్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్వర్క్స్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చిన బీఎస్ఎన్ఎల్.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 500 ఎస్ఎంఎస్‌లు కూడా పొందొచ్చు. ఇక, జియో, ఎయిర్‌టెల్ ఇదే తరహా ప్లాన్‌లో 1 జీబీ డేటాను కేవ‌లం 28 రోజుల‌కు లేదా 56 రోజుల కాల‌ప‌రిమితితో అందిస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం బంపరాఫర్ ఇచ్చింది.