గుడ్‌న్యూస్ చెప్పిన బీఎస్‌ఎన్‌ఎల్..

గుడ్‌న్యూస్ చెప్పిన బీఎస్‌ఎన్‌ఎల్..

ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎల్‌ఎల్‌) తన కస్టమర్లకు శుభావార్త చెప్పింది. కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ లేదా ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ పొందాలనుకుంటే ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. సాధారణంగా కొత్త కనెక్షన్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల నుంచి ఇన్‌స్ట్రాలేషన్‌ కింద 250 రూపాయాలు వసూలు చేస్తూ వస్తుండగా.. ఇప్పుడు ఈ మొత్తం కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. ఇక, దేశమంతటా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది బీఎస్‌ఎన్ఎల్.. కాగా, ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు కూడా దీటుగా పలు ఆఫర్లతో ఎప్పటికప్పుడు తన కస్టమర్లను ఆకట్టుకునే విధంగా.. బీఎస్‌ఎన్ఎల్ కొత్త ఆఫర్లు తెస్తున్న సంగతి తెలిసిందే.