పవన్ ఈ రాష్ట్రానికి యువ సీఎం అవుతారు

పవన్ ఈ రాష్ట్రానికి యువ సీఎం అవుతారు

పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రానికి యువ ముఖ్యమంత్రి అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయవతి తెలిపారు.  తిరుపతిలో జరిగిన జనసేన- బీఎస్పీ ఎన్నికల యుద్ధభేరిలో ఆమె ప్రసంగించారు. దేశానికి కాపలాదారు అంటూ బీజేపీ చేసిన మోసాలు ప్రజలను అర్థమయ్యాయని మండిపడ్డారు.స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో చాలా ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ పాలనే సాగిందన్నారు. సామాజిక న్యాయం అందించడంలో ఆ పార్టీలన్నీ విఫలమయ్యాయి. గతంలో వాగ్దానాలు ఇచ్చి విస్మరించిన పార్టీలను ప్రజలు ఈసారి ప్రశ్నించాలని అన్నారు. బలహీన వర్గాలు సొంత కాళ్లపై నిలబడే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ లో నాలుగు సార్లు అధికారం చేపట్టిన బీఎస్పీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిందని అన్నారు. 

పవన్ కల్యాణ్.. సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తి అని కొనియాడారు. నిజాయతీపరుడు.. ప్రజలు బాగుండాలని కోరుకునే తత్వం అని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతామని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలకు కాకుండా బీఎస్పీ-జనసేనను ప్రజలు దీవించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ- జనసేన వామపక్షాల కూటమి విజయం సాధించడం తథ్యమని తెలిపారు.