రివాల్వర్ తో మాజీ ఎంపీ కుమారుడి హల్ చల్

రివాల్వర్ తో మాజీ ఎంపీ కుమారుడి హల్ చల్

ఢిల్లీలోని హయత్ రేజెన్సీ హోటల్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కుమారుడు ఆశిష్‌ పాండే రివాల్వర్ తో హల్ చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శనివారం సాయంత్రం హోటల్‌వద్ద  పార్కింగ్ స్థలం కోసం ఆశిశ్ పాండే ఓ జంటతో గొడవకు దిగాడు. నల్ల టీషర్టు, గులాబీరంగు ప్యాంటు ధరించిన ఆశిశ్ తన రివాల్వర్ తో బెదిరిస్తున్నట్లు వీడియోలో రికార్డు అయ్యింది. హోటల్ సిబ్బంది వారిస్తున్నా ఆ జంటను బూతులు తిట్టాడు. అశిశ్  కారులో కూర్చున్న ఓ యువతి ఈ సంఘటన మొత్తం వీడియో తీసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.