కర్ణాటక సంక్షోభంలో మరో ట్విస్ట్‌

కర్ణాటక సంక్షోభంలో మరో ట్విస్ట్‌

కర్ణాటకలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌కు మరో షాక్‌ తగిలింది. అసెంబ్లీలో రేపు జరిగే విశ్వాస పరీక్షకు తాను దూరంగా ఉండబోతున్నట్టు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేష్‌ ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు సంకీర్ణ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరించిన మహేష్‌.. ఇప్పుడు ఓటింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు. విశ్వాసపరీక్షకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత్రి మాయావతి సూచించారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మహేష్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా.. సోమ, మంగళవారాల్లో శాసనసభకు తాను హాజరుకాబోవడం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే రెబెల్స్‌ బెడదతో అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి ఇప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యే యూటర్న్‌ తీసుకోవడంతో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.