బుద్ధ విగ్రహం పునఃనిర్మాణం

బుద్ధ విగ్రహం పునఃనిర్మాణం

పాకిస్థాన్ స్వాత్ వ్యాలీలో ధ్వంసమైన బుద్ధ విగ్రహాన్ని పునఃనిర్మించారు. 7వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని 2007లో తాలిబన్ ఉగ్రవాదులు పేల్చివేశారు. ఈ ఘటనతో విగ్రహం రూపురేఖలు లేకుండా పోయింది.  విగ్రహాన్ని ఉత్తర పాకిస్థాన్  స్వాత్ వ్యాలిలో 7వ శతాబ్ధానికి చెందిన రాజులు ప్రతిష్టించారు. 2007లో తాలిబన్లు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుద్ద విగ్రహం ముఖం, భుజాలపై డ్రిల్లర్ తో రంద్రాలు వేసి అందులో పేలుడు పదార్థాలు నింపి పేల్చి వేశారు. దీంతో విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా ముఖం సగం భాగం పూర్తిగా దెబ్బతింది. ధ్వంసమైన బుద్ధ విగ్రహాన్ని చూసి పలువురు పర్యాటలకు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటాలియన్ ఆర్కియలాజికల్ శాఖ విగ్రహాన్ని పునఃనిర్మించాలని భావించింది.  ఇందుకోసం ఇటాలియన్ ఆర్కియాలజీ మిషన్ 2.9మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇచ్చింది. 2012లో ఇటాలియన్ ఆర్కియాలజిస్ట్ లుకా మేరియా ఒలివేరి ఆధ్వర్యంలో విగ్రహ పునఃనిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ వారంలో పనులు పూర్తి అయ్యాయి. ఈ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది