ఏపీ బడ్జెట్‌.. ముహూర్తం మారింది..!

ఏపీ బడ్జెట్‌.. ముహూర్తం మారింది..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఇవాళ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో స్వల్ప మార్పు జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ ప్రవేశపెడతారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఐతే.. కొన్ని కారణాల వల్ల శాసనసభలో మధ్యాహ్నం 12.22 గంటలకు ఆయన ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయానికి మండలిలో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇది ముగిశాక వ్యవసాయ బడ్జెట్‌ను మునిసిపల్‌ మంత్రి బొత్స సత్యానారాయణ, మండలిలో పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు.