టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు

టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు

రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని బీజేపీ నాయకులకు చేరవేస్తున్నారని తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌. టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌లపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఈ- మెయిల్‌ ద్వారా ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బుగ్గన. ఏపీ భవన్ లో లాగ్ బుక్ ట్యాపరింగ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీడీపీ తమపై బురద జల్లుతూ బీజేపీతో అంటకాగుతోంది అని ఆరోపించారు.  వైఎస్సార్‌ సీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.