భవనం కూలి ఆరుగురు మృతి 

భవనం కూలి ఆరుగురు మృతి 

గుర్గావ్ లో నాలుగు అంతస్థుల భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. శిథిలాల నుంచి మరో ఇద్దర్ని కాపాడారు. ఉల్లాస్ ప్రాంతంలో ఓ భవనం నాలుగో అంతస్థు నిర్మాణంలో ఉండగానే ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కూలిన సమయంలో సుమారు 20 మంది వరకు  కూలీలు పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. వారిని కాపాడేందుకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నారు. పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మెలు , ఐరన్ చువ్వలు ఉండటంతో తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. గుర్గావ్ పోలీసుల యజమాని, కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.